- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ టౌన్,వెలుగు: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని జిల్లా హాస్పిటల్‌లో సీఎస్‌ఆర్ నిధులతో అందించిన వైద్య పరికరాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌కు కేంద్రం నుంచి ఏటా సగటున రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్లు దాకా వస్తున్నాయని, ఆ నిధులే హాస్పిటల్‌కు ఊపిరి పోస్తున్నాయన్నారు.
ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు పేద రోగులకు ఉపయోగపడే అనేక వైద్య పరికరాల అందజేతకు సహకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వీరారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
