ఇవాళ, రేపు GHMC పరిధిలో.. మెగా ఈ-వేస్ట్ సానిటేషన్ డ్రైవ్

ఇవాళ, రేపు GHMC పరిధిలో.. మెగా ఈ-వేస్ట్ సానిటేషన్ డ్రైవ్

ఈ వేస్ట్​ సేకరణకు స్పెషల్​ ప్రోగ్రాం చేపట్టారు  జీహెచ్​ఎంసీ అధికారులు.  ఈ వేస్ట్​ తో పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలకలుషితంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్న కమ్రంలో మెగా ఈ-వేస్ట్​ సానిటేషన్​ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీహెచ్​ ఎంసీ పరిధిలోని ఇండ్లు, ఆఫీసులు, వాణిజ్య సంస్థలనుంచి ఈ వేస్ట్​ను సేకరించనున్నారు. పాత మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, కంప్యూటర్లు, టీవీలు, ప్రింటర్లు, బ్యాటరీలు, చార్జర్లు, వైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించనున్నారు.

హైదరాబాద్​: సోమవారం( జనవరి 12) నుంచి రెండురోజుల పాటు జీహెచ్​ ఎంసీ పరిధిలో ప్రతి సర్కిల్​, డివిజన్​ లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఈవేస్ట్​ ను నేరుగా ప్రజల దగ్గర నుంచి సేకరిస్తారు. మెయిన్​ సర్కిళ్లు, మార్కెట్​ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక అపార్టుమెంట్లు, గేటెడ్​ కమ్యూఇటీల్లో గ్రూప్​ కలెక్షన్​ సిస్టమ్​ అమలు చేయనున్నారు. సేకరించిన ఈవేస్ట్​ ను ప్రభుత్వం  అనుమతి పొందిన రీసైక్లింగ్​ ఏజెన్సీలకు తరలించనున్నారు. 

ALSO READ : మున్సిపల్ ఎన్నికల్లో కోఆప్షన్ కింద ట్రాన్స్ జెండర్లకు అవకాశం

మరో వైపు ఈవేస్ట్​ ను సాధారణ చెత్తతో కలపొద్దని ప్రజలకు జీహెచ్​ ఎంసీ అధికారులు విజ్ణప్తి చేస్తున్నారు. ఈ వేస్ట్​ తో పర్యావరణ కాలుష్యం, భూగర్బజల కాలుష్యం జరిగి ఆనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.ఈ డ్రైవ్​ ద్వారా సురక్షిత రీసైక్లింగ్​, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా  ఈ కార్యక్రమాన్ని  చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ALSO READ : ఇసుక అక్రమ దందా చేస్తే ఉపేక్షించేది లేదు..

ఈ ప్రొగ్రాంలో భాగంగా ప్రజలకు శానిటేషన్​ సిబ్బంది, ఎన్ ఫోర్స్​ మెంట్​ టీమ్స్​ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించునున్నారు. ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ వేస్ట్​ ను అప్పగించాలని జీహెచ్​ ఎంసీ విజ్ణప్తి చేస్తోంది. భవిష్యత్‌లో కూడా నిరంతర ఈ-వేస్ట్ కలెక్షన్ విధానం అమలు చేసే యోచన లో ఉన్నారు. ఈ-వేస్ట్ సరైన విధంగా నిర్వహిస్తే నగరం మరింత స్వచ్ఛంగా, సురక్షితంగా మారుతుందంటున్నారు జీహెచ్​ ఎంసీ  అధికారులు