మిడిల్ ఈస్ట్ లో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్, అమెరికా దళాలు.. ఇరాన్ ఆర్మీ బేస్ క్యాంపులు, కీలక నేతల ఇండ్లే లక్ష్యంగా దాడులకు దిగాయి. హోరాహోరీగా సాగుతున్న యుద్ధంలో ఇరాన్ టాప్ కమాండర్ ను లేపేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
2025 ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ స్ట్రైక్ లలో.. ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కాప్స్ కమాండర్ (IRGC) మొహమ్మద్ పక్పోర్ చనిపోయినట్లు ఇజ్రాయెల్ అధికారిక మీడియా N12 ప్రకటించింది. ఇరాన్ అత్యంత శక్తివంతుల్లో ఒకరైన పక్పోర్.. కమాండర్ గా నియమితులై 260 రోజులైనట్లు పేర్కొంది. అయితే ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 2025లో అప్పటి కమాండర్ హుస్సేన్ సలామీని తొలగించిన తర్వాత, పాక్‌పూర్‌ను మేజర్ జనరల్ హోదాకు ప్రమోట్ చేశాడు. తమపై దాడికి ప్రయత్నిస్తే వెంటనే ప్రతిస్పందిస్తామని గత నెలలోనే, పక్‌పూర్ ఇజ్రాయెల్ , అమెరికాలను హెచ్చరించాడు. మేం సిద్దంగా ఉన్నాం.. ట్రిగ్గర్‌పై వేలు పెట్టి రెడీ ఉంచాం.. జస్ట్ నొక్కడమే.. అని హెచ్చరికలు జారీ చేశాడు.
ఇరాన్ అత్యంత శక్తివంతమైన సంస్థలలో IRGC ఒకటి అని చెప్తుంటారు. ఇస్లామిక్ రిపబ్లిక్ రాజకీయ వ్యవస్థను రక్షించే పనిలో, దేశ భద్రత విషయంలో విస్తృతమైన అధికారాలను కలిగి ఉంటుంది.
