మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరి.. యుద్ధంగా మారిన క్రమంలో.. వార్ కు సంబంధించిన ప్రెడిక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాబా వంగా ఈ యుద్ధం గురించి ముందే చెప్పారని.. నెటిజన్స్ పోస్ట్ చేస్తున్నారు. 2026 ప్రారంభంలో గ్రేట్ వార్ జరుగుతుందని.. దీని గురించి బాబా వంగా ముందే ఊహించారని కాలజ్ఞానం గురించి చెబుతున్నారు.
బల్గేరియన్ దేశానికి చెందిన బాబా వంగా కాలజ్ఞానం అంటూ యుద్ధాలు లేదా పెద్ద పెద్ద ఉపద్రవాలు జరిగినప్పుడు డిబేట్ జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. ఆమె చనిపోయాక ఆమె బోధనలపై తరచుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా బాబా ప్రిడిక్షన్స్ అంటూ వైరల్ చేస్తున్నారు.
ఎవరీ బాబా వంగా..?
బాబా వంగా 1911 లో ఉత్తర మాసిడోనియాలోని స్ట్రుమికాలోని వంగేలియా పాండెవా గుష్టెర్వాగాలో జన్మించారు. ఆమె పన్నెండేళ్ల వయసులో ఒక ప్రమాదంలో చూపు కల్పోయారు. 1970, 80 దశకాల్లో అంతర్జాతీయ సమస్యల గురించి ముందే ఊహించి చెప్పారు. ఆమె 85 ఏళ్ల వయసులో 1996 లో చనిపోయారు. 5079 వరకు జరిగే విషయాలను ముందుగానే ఊహించి చెప్పారని ఆమె భక్తులు నమ్ముతుంటారు.
నోస్ట్రడమస్ ఆఫ్ ద బల్కన్స్ అని ఆమెను పిలుస్తుంటారు. మేజర్ గ్లోబల్ ఈవెంట్స్ అయిన 9/11 అటాక్స్, తీవ్రవాదుల గ్రూపుల వ్యాప్తి మొదలైన అంశాలపై ప్రిడిక్షన్స్ చేసినట్లు ఫాలోవర్స్ చెప్తుంటారు. అయితే ఇవన్నీ రుజువు లేనివని.. ఆమెకు ఆపాదించారని కొందరు విమర్శిస్తుంటారు. సైంటిస్టులు, చరిత్రకారులు చెప్పేవాటికంటే ఆమె పేరున ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు ప్రచారం జరుగుతుంటాయి.
గ్రేట్ వార్ గురించి జోస్యం...
బాబా వంగా చెప్పిన ప్రిడిక్షన్స్ లో.. ఎక్కువగా చర్చించిన వాటిలో 2026లో జరిగే గ్రేట్ వార్ ఒకటి. ఆమె జోస్యం ప్రకారం, యుద్ధం పశ్చిమ దిశగా వ్యాపించే ముందు తూర్పున ఉద్భవించి, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలను నాశనం చేస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలను శక్తి కూటములుగా మారుస్తుందని వెల్లడించారు.
యూరప్ విధ్వంసానికి గురవుతుందని, ఖండంలోని కొన్ని ప్రాంతాలు ఆర్థికంగా, సామాజికంగా బలహీనపడతాయని ఆమె అంచనా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో, రష్యా మరింత బలంగా తయారవుతుందని ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
అయితే ఆమె చెప్పిన ఈ జోస్యాలకు సంబంధించిన లిఖిత ఆధారాలు లేవని, రికార్డులు లేవనేది చాలా మంది వాదన. ప్రస్తుతం చెలామణిలో ఉన్న వాటిలో ఎక్కువ భాగం వేరే వాళ్లు ఆమె పేరున ప్రచారంలోకి తెస్తున్నట్లు చెబుతున్నారు.
సంక్షోభాల సమయంలోనే ఆమె ఎందుకు వైరల్ :
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా, బాబా వంగా ప్రవచనాలు అంటూ X, Instagram వంటి ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవ్వటం కామన్ అయిపోయింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో జనాలను సైకాలజికల్ గా అట్రాక్ట్ చేసేందుకే ఇవి వైరల్ చేస్తారని చెబుతున్నారు. మరోవిషయం ఏంటంటే.. యుద్ధం లేదా ప్రపంచంలో అస్థిరత ఉన్నప్పుడు జనం బయంతో ఆధ్యాత్మికత వైపు లేదా ఇలాంటి జోస్యాలపై ఆకర్షితులవుతారని అంటున్నారు.
