ఏప్రిల్ నుంచి హైదరాబాద్ సిటీలో 'సర్'

ఏప్రిల్ నుంచి హైదరాబాద్ సిటీలో 'సర్'
  • ఫేక్ ఓట్ల ఏరివేతకు రంగం సిద్ధం
  • ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీ చేయనున్న అధికారులు
  • ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో 1.02 లక్షల మందికి నోటీసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలోపారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం గా ఏప్రిల్ 1 నుంచి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్జన్ పర్యవేక్షణలో 15 నియోజకవర్గాల్లో ఈ కార్య క్రమం కొనసాగనుంది. ప్రధానంగా 2002 నాటి డేటాను ప్రస్తుత 2025 డేటాతో పోల్చిచూస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు ఒకే డోర్ నెంబర్పై ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జి ల్లాలోని 46 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికే సగానికి పైగా మ్యాపింగ్ పూర్తి అయ్యింది.

 డబుల్ఓట్లు, బ్లర్ ఫోటోలు ఉన్న లక్షా 2 వేల మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారి వివరాలను సేకరించి నిజంగా వారే అయితే ఆ ఓటర్లను కొనసాగించనున్నారు. ఏదైనా తేడా ఉంటే ఆ ఓటర్లని డిలీట్ చేయనున్నారు.

నోటీసులు ఇచ్చిన వారి ఓటర్లని 12 రకాల ఐడీ ప్రూఫ్ లలో ఏదైనా ఒక్కదాంతో పరిశీలించనున్నారు. వలస వెళ్లినవారు, మరణించిన, తప్పుడు చిరునామాలతో ఉన్న ఫేక్ ఓట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఎస్ఐఆర్ కొనసాగనుంది. వరుసగా మూడు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని పక్షంలో ఆ ఓట్లను శాశ్వతం గా తొలగించాలని అధికారులు నిర్ణయించారు.