T20 World Cup: టాస్ గెలిచిన శ్రీలంక.. పాకి'స్థాన్ ఫస్ట్ బ్యాటింగ్

T20 World Cup: టాస్ గెలిచిన శ్రీలంక.. పాకి'స్థాన్ ఫస్ట్ బ్యాటింగ్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ మైదానంలో జరుగుతున్న జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ తో  శ్రీలంక తలపడుతుంది. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక మాట్లాడుతూ..  ముందుగా బౌలింగ్ చేస్తాం.. పిచ్ బాగుంది.. రెండో ఇన్సింగ్స్ లో డ్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మూడు విభాగాల్లోనూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) మా ప్లాన్ అమలు చేస్తామన్నారు. గెలిచినా ఓడినా అభిమానులు మాకు మద్దతు ఇస్తారు.. అదే మా ప్రేరణ అని చెప్పారు. ఇక తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు శనక వెల్లడించారు.

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ.. ఇది మాకు మంచి అవకాశం.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లోనూ మెరుగ్గా ఆడాలి.. మంచి స్కోరు చేసి శ్రీలంక ముందు భారీ టార్గెట్ పెట్టాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కఠినంగా ఉంటాయి.. ఏం చేయాలో మాకు స్పష్టంగా తెలుసు.. మా టీంలో 3 మార్పులు చేసినట్లు సల్మాన్ తెలిపారు.

ఇరు జట్లు: 
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(w), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(సి), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక