ట్రాన్స్ జెండర్లకు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మున్సిపాలిటీ నుంచి కోఆప్టెడ్ మెంబర్ గా ట్రాన్స్ జెండర్లను ఎన్నుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా భవన్ లో బాల భరోసా, ప్రణామ్ డేకేర్ సెంటర్ పథకాలు ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు
ALSO READ : ఇసుక అక్రమ దందా చేస్తే ఉపేక్షించేది లేదు..మంత్రి వివేక్ హెచ్చరిక
సీఎం రేవంత్ కామెంట్స్:
- ప్రజాభవన్ లో బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ ప్రారంభం
- ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల కోసం పనిచేస్తుంది
- ప్రభుత్వం అందించే పథకాలను ఉపయోగించుకోవాలి
- దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ
- దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం.. అన్ని రకాలుగా ఉంటాం
- రూ.50 కోట్లతో దివ్యాంగులకు పరికరాలు
- దివ్యాంగులకు జైపాల్ రెడ్డి స్ఫూర్తి
- వైకల్యం ఉందనే ఆలోచనను కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి
- రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం
- కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని సూచిస్తున్నా
- తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది
- దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
- వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది
- ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే..
- ప్రతీ నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తాం
- తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10 శాతం..
- తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే మా విధానం
- వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నాం
- తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోంది.
- అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం
- తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించింది
- తెలంగాణ కులగణన మోడల్ ను దేశం అనుసరిస్తోంది
- ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నాం.
- ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్ లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించాం
- ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది.. ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుంది
- తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం.
