జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్: సీఎం రేవంత్

జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్: సీఎం రేవంత్

జిల్లాల పునర్విభజనపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల పునర్విభజనపై వ్యతిరేకత వస్తున్న క్రమంలో.. నియోజక వర్గాల పునర్విభజన మాదిరిగా జిల్లాల పునర్విభజనపై కమిషన్ వేస్తామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లోనే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తామని చెప్పారు. సోమవారం (జనవరి 12) గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ 2026 ను ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. 

సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్:

  • ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
  • ఉద్యోగులే మా సారధులు, వారధులు
  • ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం కలిసి మేము 200 మందిమి లేము
  • రాష్ట్రాన్ని 10 లక్షల మంది ఉద్యోగులు నడిపిస్తున్నారు
  • ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.కోటి ఇస్తాం
  • రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల హక్కు
  • ఉద్యోగులకు డీఏ ఫైల్ పై సంతకం చేశా
  • ప్రతి నెల 100 మంది రిటైర్ అవుతున్నారు
  • ఒక్కొక్కరిపై కోటి భారం పడుతోంది
  • డీఏ పెంపుతో ప్రతి నెలా రూ.220 కోట్ల భారం పడుతోంది
  • ప్రభుత్వం  ఏం  నిర్ణయం తీసుకున్నా అమలు చేసేది ఉద్యోగులే
  • ప్రభుత్వం, ఉద్యోగులు ఒక కుటుంబం.. మీరు మేము వేర్వేరు కాదు
  •  ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యారు అనే ఆరోపణలు పట్టించుకోకండి
  •  కడుపులో విషం పెట్టుకొని మాట్లాడుతున్నరు.
  • ఫాం  హౌస్ లో ఒకాయన ఉంటే అసెంబ్లీ లో మరో ఇద్దరు ఆరోపణలు చేస్తున్నారు
  • గత ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్మెంట్, పెన్షన్, మెడికల్ బిల్స్ చెల్లించలేదు 
  • మా ప్రభుత్వం రాగానే వీటి ఫై అసెంబ్లీ లో శ్వేత పత్రం విడుదల చేసాము
  • ప్రతి నెల రూ.22 వేల కోట్లు ఖర్చు పెట్టాలి, రెవిన్యూ రూ.30 వేల కోట్లు వస్తుంది
  • ఈ రెండు సంవత్సరాలు  బకాయిలు రాక ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు 
  • గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఉద్యోగులు అమలు చేశారు
  •  ప్రతి సారి దివాలా తీశాము అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు 
  •  ఈ ప్రభుత్వం కి పెద్ద దిక్కు గా ఉండాల్సిన వ్యక్తి ఫాం హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు 
  •  సీఎం పదవి వస్తే సంతోషం అనుకున్న 
  • సీఎం అయ్యాక బరువు, బాధ్యతలు పెరిగాయి
  • మా ప్రభుత్వం లో జీతాలు మొదటి తేదీ నే వస్తున్నాయి
  •  ఉద్యోగుల కు ఒక DA ఫైల్ మీద ఈరోజు (జనవరి 12) ఉదయం సంతకం పెట్టాను 
  •  సీఎం ప్రోగ్రాం కి వస్తున్నారు అంటే ఒక శుభవార్త చెబుతారు అని ఉద్యోగులు ఎదురు చూస్తారు 
  • పీసీసీ చీఫ్ గా 12 గంటలు కష్టపడ్డా ఇపుడు ఇంకా ఎక్కువ గంటలు కష్టపడుతున్న
  •  నేను అంటే ఉద్యోగులకు ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు 
  • ప్రభుత్వం ఉద్యోగుల కు ఇన్సూరెన్స్ ఇస్తున్నాము
  • హెల్త్ కార్డ్ మీద చర్చలు జరుగుతున్నాయి
  •  ఏప్రిల్ 1 నుంచి మీ సమస్యలు పరిష్కారం చేస్తామం, ఎక్కువ బిల్స్ రిలీజ్ చేస్తాం
  •  ప్రభుత్వం, ఉద్యోగులు వేరు వేరు అనే అభిప్రాయం ప్రజల్లో రావొద్దు 

ALSO READ : సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల నజర్..

ALSO READ : బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్