సౌండ్ పొల్యూషన్ పై పోలీసులు దృష్టి సారించారు. భారీ శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ కు కారణం అవుతున్న వాహనాలపై కొరడా ఝులిపిస్తున్నారు. శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బిగించిన శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్వాహనాలను సైలెన్సర్లను తొలగించి బుల్డోజర్లు తొక్కించారు.మోతాదుకు మించి సౌండ్ దాటితే వేటు తప్పదని, రూల్స్ అతిక్రమించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
సోమవారం (జవనరి 12) తాండూరు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో వాహన దారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఎక్కువ శబ్దాలు చేసే వాహనాలు నడపడం నిబంధనలకు విరుద్ధమని నర్సింగ్ యాదవ్ అన్నారు.
►ALSO READ | మున్సిపల్ వార్డులలో.. కొత్తగా సీసీ రోడ్లు..మంత్రి వివేక్ వెంకటస్వామి
వాహనదారులు ప్రత్యేక సైలెన్సర్లను అమర్చుకుని భారీ శబ్దాలు చేస్తూ కాలుష్యాన్ని పెంచుతున్నారని అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరించారు. వాహనాలకు సౌండ్ సైలెన్సర్లను అమర్చే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మెకానిక్ షాపుల నుంచి, వాహనదారుల నుంచి స్వాదీనం చేసుకున్న సైలెన్సర్లను జేసీబీ యంత్రంతో తుక్కు తుక్కు చేయించారు.
