వికారాబాద్ జిల్లాలోమహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. కోట్ పల్లిలో పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలంలో దొరికిన లెటర్ లో డిప్రెషన్ కుగురైన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
వికారాబాద్ పట్టణంలోని టౌన్ గంగారం సాయి బాబా కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సూసైట్ నోట్ ను గుర్తించారు పోలీసులు.
సీఐ రఘుకుమార్ మాట్లాడుతూ..మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.ధరూర్ పోలీస్ స్టేషన్లో రైటర్ గా పనిచేస్తున్న దివ్య సూసైడ్ లెటర్‌లో “నా చావుకు ఎవరు కారణం కాదు. నాన్న లేకపోవడం వల్లే మనకు ఇన్ని బాధలు” అని పేర్కొన్నట్లు సీఐ వెల్లడించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు, సహచరులు, కాలనీ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
