అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం...

అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం...

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం ( జులై 21 ) జరిగిన ఈ కార్యక్రమంతో బల్కంపేట పరిసరాలు కోలాహలంగా మారాయి . ఈ వేడుక చూసేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలివచ్చారు. ఎల్లమ్మ కల్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి, కూతురు హాజరయ్యారు. 

ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ క్రమంలో శివసత్తుల పూనకాలు, పోతురాజుల ఆటలతో హోరెత్తింది హైదరాబాద్. డప్పు చప్పుళ్ళు, డీజే పాటలతో సందడి వాతావరణం నెలకొంది. నెత్తి మీద బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చారు భక్తులు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఎల్లమ్మ కల్యాణానికి వచ్చే భక్తుల భద్రత కోసం 36 రెగ్యులర్ కెమెరాలతో పాటు అదనంగా 130 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.