ఆరుట్ల స్కూల్ అద్భుతం.. ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దుతాం..

ఆరుట్ల స్కూల్ అద్భుతం..  ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దుతాం..

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ శనివారం సందర్శించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. ఈ స్కూల్​ఒక అద్భుతమని, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దడమే సర్కారు లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, ఆఫీసర్లుగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు.