లారీ కింద పడి విద్యార్థి మృతి.. దమ్మాయిగూడలో ఘటన

లారీ కింద పడి  విద్యార్థి మృతి.. దమ్మాయిగూడలో ఘటన

జవహర్ నగర్, వెలుగు: దమ్మాయిగూడ లేబర్ అడ్డా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తన అన్నతో కలిసి స్కూటీపై పాఠశాలకు వెళ్తున్న 13 ఏళ్ల విద్యార్థి ఎండీ.సూఫియాన్‌‌ను వెనక నుంచి వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనక టైరు సూఫియాన్ తలపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ ను కిషన్ రాథోడ్‌‌గా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.