మెదక్, వెలుగు: ప్రతి బీఎల్ఏ బాధ్యతగా పనిచేసి ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. సోమవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మెదక్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో సర్‌ను 100 శాతం పూర్తి చేయాలన్నారు. ‘సర్’విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేసిన బీఎల్‌ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో సన్మానం చేయిస్తామన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్‌గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
