పంజాగుట్ట, వెలుగు: తట్టు వ్యాధి నివారణ, చికిత్స పద్ధతుల కోసం ఆగస్టు 9న ఫ్రీ హెల్త్క్యాంప్నిర్వహించనున్నట్టు రెస్ట్ ప్రైస్ ఆటిజం ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తోడుపులూరి తెలిపారు. తట్టు వైరస్ వల్ల వచ్చే వ్యాధి అని తెలియక చాలామంది టైం వేస్ట్చేస్తున్నారన్నారు. వైద్యం చేయించకుండా ఇతర మార్గాల్లో వెళ్తుండడంతో చిన్నారుల్లో వైరస్ విజృంభించి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు.
తట్టు వ్యాధిని నియంత్రించేందుకు మణికొండ పంచవటి కాలనీలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివరాలకు 91000 6 5552, 8433 529 769 ఫోన్నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
