బైకుల దొంగ అరెస్ట్.. నెరేడ్‌‌మెట్ పోలీసులు 11 బండ్లు స్వాధీనం

బైకుల దొంగ అరెస్ట్.. నెరేడ్‌‌మెట్  పోలీసులు 11 బండ్లు స్వాధీనం

మల్కాజిగిరి, వెలుగు: బైక్​ చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్​ చేశారు. సోమవారం నెరేడ్‌‌మెట్ పోలీస్‌‌స్టేషన్‌‌లో డీసీపీ సీహెచ్. శ్రీధర్  వివరాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా అత్వెల్లి గ్రామానికి చెందిన గుడిసె సుశాంత్ అలియాస్ చిన్న(32) సోమవారం నంబర్‌‌ప్లేట్ లేని యమహా ఎఫ్‌‌జెడ్ బైక్‌‌పై సైనిక్‌‌పురి భవన్స్ కాలేజీ సమీపంలో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

 విచారించగా మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో బైకుల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అనంతరం చోరీ వాహనాలు కొనుగోలు చేసిన ప్రవీణ్‌‌ను కూడా అరెస్టు చేశారు. విచారణలో మనోహరాబాద్, పేట్‌‌బషీరాబాద్, మేడ్చల్, అల్వాల్, నెరేడ్‌‌మెట్ పోలీస్‌‌స్టేషన్ల పరిధిలో చోరీలు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 11 బైక్​లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.