PSLV C62 రాకెట్ లాంచ్ కు కౌంట్ డౌన్.. కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం

PSLV C62 రాకెట్ లాంచ్ కు కౌంట్ డౌన్.. కొత్త ఏడాదిలో ఇస్రో  తొలి ప్రయోగం

PSLV C62 రాకెట్ ప్రయోగానికి సిద్దంగా ఉంది.  ఏపీలోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి  సోమవారం (జనవరి 12) ఉదయం10.17 గంటలకు  ఇస్రో PSLV C62  రాకెట్ ను  ప్రయోగించనున్నారు.రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాటు పూర్తి చేశారు సైంటిస్టులు. రాకెట్ ప్రయోగానికి 24 గంటల ముందు ఆదివారం ఉదయం PSLV C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమయింది. 

2026లో చేపడుతున్న తొలి ప్రయోగం అని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. PSLV రాకెట్ ప్రయోగంలో ఇది 64వ ప్రయోగం అన్నారు. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 442 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించినట్లు నారాయణన్ తెలిపారు. 

ఇందులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈవోఎస్–ఎన్1(అన్వేష్) ప్రధాన పేలోడ్‌‌. ఇది మన దేశంలోని వ్యవసాయం, సిటీ మ్యాపింగ్, పర్యావరణ పర్యవేక్షణ, బార్డర్లలో వ్యూహాత్మక నిఘా వంటి రంగాల్లో సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. దీనికితోడు ఈ మిషన్‌‌లో భారతీయ స్టార్టప్‌‌లు, అకాడమిక్  సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చేసిన ఆయుల్ శాట్, ఎంవోఐ-1, కీస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్ స్ట్రేటర్(కిడ్) వంటి ఆసక్తికరమైన 14 కో-ప్యాసెంజర్ పేలోడ్‌‌లు కూడా ఉన్నాయి.