చాట్‌జీపీటీ యూజర్ల కోసం హెల్త్ ఫీచర్‌ను తీసుకురానుంది. ఓపెన్ ఏఐ తన చాట్బాట్లో ‘హెల్త్’ ట్యాబ్‌ను యాడ్ చేసింది. ఇది హెల్త్‌కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇది హెల్త్ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. ల్యాబ్ రిపోర్ట్స్‌ను ఇందులో అప్లోడ్ చేస్తే మెడికల్ టెర్మ్స్‌ను ఈజీగా వివరిస్తుంది. అలాగే డాక్టర్ని కలిసినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? వంటివి తెలియజేస్తుంది.
అయితే తమ హెల్త్ అప్డేట్స్ గురించి ఏఐకి ఇస్తే అందరికీ తెలిసిపోతుందనుకుంటారేమో, అస్సలు కాదు. ఆల్రెడీ హెల్త్ ట్యాబ్‌లో మీరు చేసే కాన్వర్జేషన్స్ను ఓపెన్ ఏఐ తన ఏఐ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడానికి ఉపయోగించదు. మెయిన్ చాట్‌లో హెల్త్ గురించి అడిగినా ప్రైవసీ కోసం మిమ్మల్ని హెల్త్ ట్యాబ్‌కి వెళ్లమని సిస్టమ్ సజెస్ట్ చేస్తుంది. అంతేకాదు.. మీరు తీసుకునే ఫుడ్, చేసే ఎక్సర్సైజ్లు మీ బాడీ డేటాను బట్టి పర్సనల్ అడ్వైజ్‌లు ఇస్తుంది.
వారానికి దాదాపు 230 మిలియన్ల మంది యూజర్లు ఇప్పటికే హెల్త్ సజెషన్స్ కోసం చాట్‌జీపీటీని వాడుతున్నారని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్‌ని ఇతర యాప్‌లతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆపిల్ హెల్త్, ఫంక్షన్, మై ఫిట్నెస్ పాల్ వంటివాటిని యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ని అమెరికా ఎఫ్.డి.ఏ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా రిలీజ్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ ఫ్రీ, ప్లస్, ప్రో వంటి ప్లాన్ల యూజర్లకు ఫస్ట్ అటెంప్ట్‌లో యాక్సెస్ ఇస్తుంది. యూరోపియన్ దేశాల్లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు. రాబోయే రోజుల్లో వెబ్, ఐఒఎస్ యూజర్లకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది.
