IND vs ZIM: జింబాబ్వే– భారత్ మ్యాచ్కి ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్! 

IND vs ZIM: జింబాబ్వే– భారత్ మ్యాచ్కి ముందు బీసీసీఐ మాస్టర్ ప్లాన్! 

IND vs ZIM: చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్–జింబాబ్వే సూపర్-8 మ్యాచ్‌కు ముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్ భారత్‌కు ‘డూ ఆర్ డై’ కావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్ జరగాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటి వరకు రాత్రి మ్యాచ్‌లలో డ్యూ (తేమ) పెద్దగా ప్రభావం చూపించలేదు.. ఈ వారం ఉష్ణోగ్రతలు పెరగడంతో, చెపాక్‌లో డ్యూ సమస్య తలెత్తకుండా గ్రౌండ్ స్టాఫ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ప్రత్యేక ఏర్పాట్లు: 
మ్యాచ్‌కు ముందు రెండు రోజుల పాటు అవుట్‌ఫీల్డ్‌పై నీటితో కలిపిన ప్రత్యేక కెమికల్‌ను స్ప్రే చేశారు. ఇవాళ మధ్యాహ్నం కూడా ఇదే ప్రక్రియను మళ్లీ చేశారు. దీని వల్ల రాత్రి సమయంలో మైదానంపై తేమ ప్రభావం పూర్తిగా తగ్గుతుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.

ALSO READ : టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్

‘డ్యూ క్యూర్’?: 
ఈ ప్రత్యేక మిశ్రమం గడ్డి మీద స్ప్రే చేయగానే, గడ్డి ఆకులపై తేమ నిల్వ ఉండకుండా చేస్తుంది. గడ్డి తడిచినా తేమ వెంటనే అది ఇంకిపోతుంది. దాంతో బౌలర్లు, ఫీల్డర్లు మైదానంలో జారకుండా ఉంటుంది. బాల్ కూడా మంచిగా గ్రిప్ అవుతుంది.

భారత్ జట్టు ప్రాక్టీస్:
భారత జట్టు చెపాక్‌లో ప్రాక్టీస్ చేసింది. డ్యూ లేకుండా పరిస్థితులు అనుకూలంగా ఉండటంపై టీమ్ మేనేజ్‌మెంట్ సంతృప్తి వ్యక్తం చేసింది. వర్షం పడుతుందనే టెన్షన్ లేకుండా ఆటగాళ్లు మ్యాచ్‌పై దృష్టి పెట్టారు. ఈ విధానం సక్సెస్ అయితే, టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్స్‌, ఫైనల్‌లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. అలాగే, డ్యూ కారణంగా ఫలితాలు మారిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లలో కూడా ఈ టెక్నిక్‌ను ఉపయోగించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. 

చెపాక్ పిచ్ స్వభావం: 
సాధారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ టోర్నీలో బ్యాటర్లకు కొంత సహకారం లభిస్తోంది. ఫాస్ట్ బౌలర్లకు లైన్, లెంగ్త్ నియంత్రణ కష్టంగా మారిపోయింది. ఈ కీలక మ్యాచ్‌లో భారత్ ఎలాంటి టీమ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి. అయితే ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం.. సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. గెలిస్తే పాయింట్లు, నెట్ రన్ రేట్ మెరుగుపడి అవకాశాలు ఉన్నాయి. ఓడితే మాత్రం దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.