SA vs WI: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్

SA vs WI: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్

SA vs WI: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మాట్లాడుతూ.. పిచ్ కొద్దిగా టాకీగా ( జిగటగా ) ఉంది.. అందుకే మొదట బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సౌతాఫ్రికా మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. కగిసో రబడా జట్టుకు కీలక ఆటగాడిగా మారాడని, ఈ మైదానంలో ఐపీఎల్ అనుభవం కూడా అతనికి ఉపయోగపడుతుందని మార్క్రామ్ చెప్పారు.  
 
విండీస్ కెప్టెన్ షై హోప్ మాట్లాడుతూ.. మేము కూడా టాస్ గెలిచుంటే ముందుగా బౌలింగ్‌నే ఎంచుకునే వాళ్లమన్నారు. కానీ స్కోర్ బోర్డుపై పరుగులు పెట్టడంపై దృష్టి పెడతాం.. ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడాం, ఈ మ్యాచ్‌పై కూడా పట్టు సాధించేలా ప్లాన్ సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం.. అకీల్ హొసేన్ స్థానంలో రోస్టన్ చేజ్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు.  

ALSO READ : భారత్ సింపుల్గా సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలో తెలుసా? 


వెస్టిండీస్:
బ్రాండన్ కింగ్, షై హో (వికెట్ కీపర్/ కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మ్యాథ్యూ ఫోర్డ్, గుడకేశ్ మోటీ, షమార్ జోసెఫ్

సౌతాఫ్రికా:
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, దేవాల్డ్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, లుంగి ఎన్‌గిడీ