Team India: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన దశకు చేరుకుంది. సూపర్-8 రౌండ్‌లో ఇంకా కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉండటంతో సెమీఫైనల్‌కు చేరే పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటికే సూపర్-8లో ఆరు మ్యాచ్‌లు పూర్తయినా, కేవలం గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ ఒక్క జట్టు మాత్రమే సెమీఫైనల్ బెర్త్‌ను ఫిక్స్ చేసుకుంది. రెండో స్థానం కోసం మిగిలిన జట్లు పోటీ పడుతున్నాయి. గ్రూప్-1 నుంచి ఇప్పటివరకు ఏ టీమ్ కూడా సెమీఫైనల్‌కి అర్హత సాధించలేదు.
సూపర్-8లో భారత్ ఆరంభ మ్యాచ్ లోనే తడబడింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడింది. ఈ ఓటమితో జట్టు నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. దీంతో సెమీఫైనల్ అవకాశాలు కష్టంగా మారాయి. ఇప్పుడు భారత్‌కు మిగిలిన ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకం. ముఖ్యంగా జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా చెప్పాలి.
పాయింట్ల పట్టిక
* వెస్టిండీస్ – 1 మ్యాచ్, 1 విజయం, 2 పాయింట్లు
* సౌతాఫ్రికా – 1 మ్యాచ్, 1 విజయం, 2 పాయింట్లు
* భారత్ – 1 మ్యాచ్, 1 ఓటమి, 0 పాయింట్లు
* జింబాబ్వే – 1 మ్యాచ్, 1 ఓటమి, 0 పాయింట్లు
భారత్ సెమీఫైనల్‌కు ఎలా చేరాలి?
ఫస్ట్ స్టెప్:
వెస్టిండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడిస్తే, భారత్ జింబాబ్వేపై విజయం సాధించాలి.. అప్పుడు భారత్–వెస్టిండీస్ మధ్య జరిగే చివరి మ్యాచ్ నేరుగా క్వార్టర్ ఫైనల్‌లా మారుతుంది. ఆ మ్యాచ్ గెలిచిన టీమ్ సెమీస్ కి వెళ్తుంది. దీనికి నెట్ రన్ రేట్ తో పని లేదు.
సెకండ్ స్టెప్:
వెస్టిండీస్ సౌతాఫ్రికాను ఓడిస్తే, భారత్ జింబాబ్వేపై భారీ తేడాతో గెలవాలి.. అనంతరం వెస్టిండీస్‌పై కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో నెట్ రన్ రేట్ చాలా కీలకంగా మారనుంది.
థర్డ్ స్టెప్:
భారత్ జింబాబ్వేతో ఓడిపోతే సెమీఫైనల్ ఆశలు దాదాపుగా ముగిసినట్లే.. సాంకేతికంగా ఛాన్స్ ఉప్పటికీ, చాలా అద్భుతాలు జరగాల్సిన పరిస్థితి ఉంటుంది.
గ్రూప్-2లో పరిస్థితి:
గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ కి చేరుకుంది. న్యూజిలాండ్ శ్రీలంకపై గెలిచి తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. కానీ పాకిస్థాన్ పరిస్థితి మాత్రం చాలా సంక్లిష్టంగా మారిపోయింది.
గ్రూప్-2 పాయింట్ల పట్టిక:
* ఇంగ్లాండ్ – 2 మ్యాచ్‌లు, 4 పాయింట్లు
* న్యూజిలాండ్ – 2 మ్యాచ్‌లు, 3 పాయింట్లు
* పాకిస్థాన్ – 2 మ్యాచ్‌లు, 1 పాయింట్
* శ్రీలంక – 2 మ్యాచ్‌లు, 0 పాయింట్లు
పాకిస్థాన్ కి సెమీస్ ఛాన్స్:
పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ శ్రీలంకతో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించడం, న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌తో ఓడితేనే పాక్ జట్టుకి అవకాశం ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్ జరిగిన పాకిస్థాన్ ప్రయాణం అక్కడితో ముగుస్తుంది.
