వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి తానొక ఆల్ రౌండర్ అనే సంగతి గుర్తు చేసే పనిలో ఉన్నాడు. కొత్త అద్భుతంగా బౌలింగ్ చేసే రానా.. లోయర్ ఆర్డర్ లో జట్టుకు విలువైన పరుగులు అందించగలడు. కివీస్ తో జరిగిన తొలి వన్డేలో మొదట బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టిన రానా.. ఆ తరువాతః బ్యాటింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు 7 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 23 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. హర్షిత్ ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
ALSO READ : ప్రయోగం అనుకుంటే పొరపాటే..
కొంతమంది మాత్రం హర్షిత్ రానా జట్టులో అనవసరం విమర్శకులకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చాడు. అసలు టీమిండియా తనకు వరుసగా ఎందుకు అవకాశాలు ఇస్తుందో తొలి వన్డే తర్వాత చెప్పుకొచ్చాడు. తనను జట్టు యాజమాన్యం ఆల్ రౌండర్ గా చేయాలని భావిస్తోందని రానా తెలిపాడు. "టీమ్ మేనేజ్‌మెంట్ నన్ను ఆల్ రౌండర్‌గా తీర్చిదిద్దాలని కోరుకుంటోంది. నా ఆల్ రౌండ్ ఆటతో నేను 8వ స్థానంలో 30 నుంచి 40 పరుగులు సాధించగలనని జట్టు మేనేజ్‌మెంట్ నాకు చెప్పింది. నేను అదే పనిలో ఉన్నాను. నెట్స్‌లో నా బ్యాటింగ్‌కు ఎక్కువ సమయం ఇస్తున్నాను". అని హర్షిత్ రానా తొలి వన్డే అనంతరం తెలిపాడు.
ALSO READ : ఎవ్వరూ ఊహించని క్రికెటర్..
హర్షిత్ రానాపై కొన్ని నెలలుగా విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ కు హర్షిత్ రానా ఎంపికైన దగ్గర నుంచి వ్యక్తిగతంగా నెటిజన్స్ ఈ టీమిండియా పేసర్ ను టార్గెట్ చేస్తున్నారు. జట్టులో ఎంపికవ్వడం తన తప్పు కాకపోయినా రానాపై ఈ రేంజ్ లో విమర్శలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హర్షిత్ ను కావాలనే భారత జట్టుకు ఎంపిక చేస్తున్నారని కొంతమంది వాదించారు. ఏడాది కాలంగా టీమిండియాలో మూడు ఫార్మాట్ లలో హర్షిత్ రానా ఆడుతున్నాడు. ప్లేయింగ్ 11 లో స్థానం సంపాదించుకున్నా స్క్వాడ్ లో మాత్రం ఎంపికవుతున్నాడు.
ALSO READ : టీమిండియాలో నన్ను సెలక్ట్ చేయరని తెలుసు..
ఆస్ట్రేలియాపై జరగబోయే వన్డే, టీ20 స్క్వాడ్ లోనూ హర్షిత్ ఉన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే, టీ20 సిరీస్ లోనూ హర్షిత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే హర్షిత్ రానాకు వరుసగా ఛాన్స్ ఇవ్వడం కొంతమందికి నచ్చడం లేదు. దీంతో హర్షిత్ పై దారుణంగా ట్రోలింగ్ నడించింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటున్న గంభీర్ ఐపీఎల్ 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ మెంటార్. మరోవైపు హర్షిత్ కూడా కేకేఆర్ జట్టు తరపున బాగా ఆడుతూ వెలుగులోకి వచ్చాడు. కేకేఆర్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఆ జట్టులోని రానాకు గంభీర్ వరుస అవకాశాలు ఇస్తున్నాడని నెటిజన్స్ అనుకుంటున్నారు.
