ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజ్యసభ సీటుపై ఇవాళ క్లారిటీ.!

ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజ్యసభ సీటుపై ఇవాళ క్లారిటీ.!

 తెలంగాణలో ఖాళీ  అయిన రెండు రాజ్యసభ సీట్ల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఒక సీటుకు అభిషేక్ మను సింఘ్వీ పేరు ఖరారైనప్పటికీ రెండో సీటుపై స్పష్టత రాలేదు. దీని కోసం    సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లగా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఢిల్లీకి రావద్దని హైకమాండ్ సూచించినట్లు సమాచారం.  అభ్యర్థుల ఎంపికపై జూమ్ ద్వారా చర్చించాలంటూ అధి ష్ఠానం తెలిపిన నేపథ్యంలో మహేష్ గౌడ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. 

రెండో రాజ్యసభ సీటును తన అనుచరుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి దక్కించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,కేంద్రమాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డా. వినయ్ పేరును ఇప్పటికే సిఫారసు చేసినట్లు చర్చ సాగుతోంది. 

ఈ  పరిణామాలతో పార్టీలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో తన పర్యటన వాయిదా పడిందని మహేష్ గౌడ్ మీడియాకు తెలిపారు. మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరా జన్ తో కలిసి హైకమాండ్ తో  జూమ్ ద్వారా అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. మార్చి 5న  రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు.