గూగుల్ చాట్లో ఇంపార్టెంట్ కాన్వర్సేషన్‌ని పిన్ చేయాలంటే మూడు పద్ధతులు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌లో అయితే గూగుల్ చాట్ ఓపెన్ చేసి పిన్ చేయాల నుకుంటున్న లిస్ట్ మీద ట్యాప్ చేసి కాన్వర్సేషన్‌ని హోల్డ్ చేయాలి. తర్వాత స్పేస్ లిస్ట్ ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి. ఆపై పిన్ చేయాలి. అన్ పిన్ చేయాలన్నా ఇదే ప్రాసెస్.
ఐఒఎస్లో కూడా సేమ్ ప్రాసెస్. కంప్యూటర్లో అయితే చాట్ ఓపెన్ చేసి కాన్వర్సేషన్‌లో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేయాలి. తర్వాత పిన్ లేదా అన్‌పిన్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఒఎస్లో గూగుల్ మెయిల్ కాన్వర్సేషన్స్ని పిన్ లేదా అన్ పిన్ చేయాలంటే.. జీమెయిల్ ఓపెన్ చేసి కిందికి వెళ్లి చాట్ మీద ట్యాప్ చేయాలి. సిస్టమ్‌లో అయితే ఎడమవైపున చాట్‌ని క్లిక్ చేస్తే సరి.
