తెలంగాణలో 43 మంది ఐఏఎస్ల బదిలీ..సచివాలయం నుంచి జిల్లాల దాకా భారీ మార్పులు

తెలంగాణలో  43 మంది ఐఏఎస్ల బదిలీ..సచివాలయం నుంచి జిల్లాల దాకా భారీ మార్పులు
  •  
  • ఇరిగేషన్​కు ఈ.శ్రీధర్, ఇండస్ట్రీస్​కు ఎన్​.శ్రీధర్
  • పంచాయతీరాజ్ ​స్పెషల్  సీఎస్​గా సంజయ్​ కుమార్​.. 
  • జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్​ బొజ్జా  
  • మూడో డిస్కంకు కొత్త సీఎండీగా ముషారఫ్ అలీ ఫారూఖీ​ 
  • ఆర్థిక, ప్రణాళికా విభాగాల కాdhaదర్శిగా గౌరవ్​ ఉప్పల్​
  • 11 జిల్లాలకు కొత్త కలెక్టర్లు 
  • సచివాలయం నుంచి జిల్లాల దాకా భారీ మార్పులు
  • ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్​ రామకృష్ణారావు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పాలనాపరమైన అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా 43 మంది ఐఏఎస్​లతో పాటు మరో ఇద్దరు ఉన్నతాధికారులకు స్థానచలనం కల్పిస్తూ సీఎస్  కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ స్థాయిలో కీలక శాఖల కార్యదర్శులతోపాటు పెద్ద సంఖ్యలో జిల్లాల కలెక్టర్లను మార్చారు. 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది.  పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమలు, సాధారణ పరిపాలన, సాగునీటి పారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారుల మార్పు ఈ బదిలీల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల స్పెషల్ సీఎస్​గా సంజయ్ కుమార్‌ను నియమించారు. 

ఆయన స్థానంలో  ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. సాధారణ పరిపాలన, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నీటిపారుదల, క్యాడ్ శాఖల కార్యదర్శిగా ఈ. శ్రీధర్‌ను నియమించింది. ఆర్థిక, ప్రణాళికా విభాగాల కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్‌కు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటు చేసిన మూడో డిస్కం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీని నియమించింది. ఇప్పటికే ఆ డిస్కం పరిధి, ఉద్యోగుల పంపకంపై ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ  సీఎండీగా జితేష్ వి పాటిల్‌కు బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి గౌరవ్ ఉప్పల్‌ను బదిలీ చేసి, ఇక్కడ ఆర్థిక, ప్రణాళికా విభాగాల కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. 

అలాగే విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖల బాధ్యతలను ఎం దాన కిశోర్‌కు అదనంగా అప్పగించారు. ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాల అమలు విభాగం స్పెషల్​సీఎస్ సవ్యసాచి ఘోష్‌కు అదనంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం పగ్గాలు అప్పగించారు. కరీంనగర్ కలెక్టర్‌గా ఉన్న పమేలా సత్పతిని కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా, రాహుల్ రాజ్‌ను సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా, బి.విజయేంద్రను గురుకులాల సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా నియమించారు. వాస్తవానికి కొంతమంది సెక్రటరీలు కొంత కాలం కిందటే బదిలీ కాగా వారిని ఆయా శాఖల నుంచి తప్పించి వేరే స్థానానికి బదిలీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ల విషయంలోనూ మంత్రులతో సఖ్యత లేకపోవడం, పనితీరు సరిగ్గా లేకపోవడం, ఇతర ఆరోపణలతోనే మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

కీలక శాఖల కార్యదర్శుల బదిలీలు ఇలా..

  • ఐఏఎస్​ అధికారి          బదిలీ స్థానం
  • సంజయ్ కుమార్    పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 
  • శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • సవ్యసాచి ఘోష్    సంక్షేమ పథకాల అమలు, 
  • సీఎస్సార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • ఎం.దానకిశోర్    విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖల అదనపు బాధ్యతలు
  • ఎన్.శ్రీధర్    ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి 
  • (గనుల శాఖ అదనపు బాధ్యతలు)
  • రాహుల్ బొజ్జా    సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి
  • (బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలు)
  • ఈ. శ్రీధర్    నీటిపారుదల శాఖ (ఇరిగేషన్ అండ్ క్యాడ్) కార్యదర్శి
  • గౌరవ్ ఉప్పల్    రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికా శాఖల కార్యదర్శి
  • (టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)
  • బి. విజయేంద్ర బోయి    గురుకులాల సొసైటీ (టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్)
  • కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్
  • డి.దివ్య    ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ (అదనపు బాధ్యతలు)
  • సిక్తా పట్నాయక్    ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • భవేష్ మిశ్రా    ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి
  • అధికారి పేరు    బదిలీ అయిన కొత్త స్థానం
  • అద్వైత్ కుమార్ సింగ్    ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో 
  •     కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి
  • ఎం. హనుమంతరావు    దేవాదాయ శాఖ డైరెక్టర్ 
  • (గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి అదనపు బాధ్యతలు)
  • పమేలా సత్పతి    కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్
  • రాహుల్ రాజ్    సహకార శాఖ ప్రత్యేక కమిషనర్
  • జితేష్ వి.పాటిల్    టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ
  • సంతోష్ బి.ఎం.    గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్
  • ఎండీ.ముషారఫ్ అలీ ఫారూఖీ    మూడో డిస్కం (కొత్తది) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
  • పి.కాత్యాయని దేవి    రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
  • శివేంద్ర ప్రతాప్    హైదరాబాద్ మెట్రో రైల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
  • మందా మకరంద్    రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ 
  •     (సీసీఎల్ఏ అదనపు బాధ్యతలు)
  • పర్మార్ పింకేశ్ కుమార్    కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్