హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తం 4,63,354 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 4,52,980 మంది హాజరయ్యారు.10,374 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు.
కాగా, ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడుతూ నలుగురు పట్టుబడ్డారు. వరంగల్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. అయితే, వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు అబ్జర్వర్లు పర్యవేక్షించారు.
