- స్టడీ సర్కిల్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీసీ స్టడీ సర్కిల్ స్టూడెంట్లకు గ్రూప్ 1 ఆఫీసర్లతో ఓరియెంటేషన్ ఇస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వెల్లడించారు. రాష్ర్ట వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిల్స్ ఉన్నాయని..వాటిలో గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్లను 50 మందిని ఎంపిక చేసి వారికి గ్రూప్ 1 ఆఫీసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్ లోనే వంద మంది సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నారని హరికృష్ణ చెప్పారు. గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం, వ్యవసాయ కుటుంబాలు, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఈ 50 మందిలో ఉన్నారన్నారు. గ్రూప్ 1 విజేతను కలవడం ద్వారా వారిలో పరీక్ష రాసే మెలకువలు మెరుగుపడతాయని హరికృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ఆఫీసర్లతో బీసీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇప్పించటం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు.
