డాక్టర్లూ.. డుమ్మా కొడితే వేటు తప్పదు..టైంకు రాకున్నా ఉపేక్షించం: మంత్రి దామోదర

డాక్టర్లూ.. డుమ్మా కొడితే వేటు తప్పదు..టైంకు రాకున్నా ఉపేక్షించం: మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు డుమ్మా కొడితే ఊరుకునేది లేదని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అధికారుల పనితీరుపై ఆయన సీరియస్ అయ్యారు. కొన్ని హాస్పిటళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ తక్కువగా ఉంటోందని, విధులకు గైర్హాజరవడాన్ని, నిర్లక్ష్యంగా ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.

‘‘ప్రభుత్వ ఆస్పత్రులకు బిల్డింగ్‌‌లు కట్టిస్తున్నాం, అడిగిన ఎక్విప్‌‌మెంట్లు ఇస్తున్నం, ప్రమోషన్లు కూడా ఇస్తున్నాం. కానీ, హాస్పిటల్‌‌లో ఉండి వైద్యం చేయాల్సింది మీరే కదా? డ్యూటీకి డుమ్మా కొడితే ఎలా? డ్యూటీ ఎగ్గొడితే మాత్రం ఊకునేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటం. సమయానికి రాకున్నా ఉపేక్షించం’’ అని మంత్రి దామోదర వార్నింగ్ ఇచ్చారు.