- అన్నోజిగూడలో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) అఖిల భారత మహాసభలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ అన్నోజిగూడలోని ఆర్వీకే (రాష్ట్రీయ విద్యా కేంద్రం) స్కూల్ ప్రాంగణంలో మార్చి 1 వరకు మూడు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. ఇందులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు అటెండ్ కానున్నారు.
20 ఏండ్ల తర్వాత మహాసభలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. ఈ సభల్లో రైతుల హక్కుల సంరక్షణ, వ్యవసాయ రంగ బలోపేతం కోసం కీలక చర్చలు జరగనున్నాయి.సేంద్రీయ సాగులో స్వయం సమృద్ధి, కృషి విజ్ఞాన కేంద్రాల భాగస్వామ్యం, నాబార్డు పాత్ర వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు బీకేఎస్ నేత, సీసీఎంబీ విశ్రాంత ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రావు వెల్లడించారు.
