కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు : వివేక్ వెంకటస్వామి

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణా రాష్ట్ర ఖజానా ఖాలీ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ. లక్ష కోట్ల నిధులు వృధా చేశారని ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 త్వరలోనే మహిళలకు రూ. 2500 రూపాయలు అకౌంట్ లలో వేయడం జరుగుతుందని వెల్లడించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మహిళలకు రూ. 6 వేలు ఇస్తానని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం ధనవంతుల కోసమే పని చేసిందని విమర్శించారు.  అందరి అకౌంట్ లలో 15 లక్షల రూపాయలు వేస్తానని మోసం చేశారని చెప్పారు. 

బీజేపీ పార్టీ ధనికుల కోసం, బీఆర్ఎస్ పార్టీ కమీషన్ ల కోసం పని చేస్తుందని ఆరోపించారు. ప్రధాని మోదీ కూడా కేసీఆర్ లాగ అవినీతి పరుడయ్యారని విమర్శించారు. పెద్దపల్లి ప్రజలు వంశీ కృష్ణ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వివేక్ వెంకటస్వామి