CSK vs GT: శతకాలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు.. చెన్నై ముందు భారీ లక్ష్యం

CSK vs GT: శతకాలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు.. చెన్నై ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ లో మరో భారీ స్కోర్ నమోదయింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్లు వీర విధ్వంసం సృష్టించారు. పోటీపడే పడి పరుగులు చేస్తూ జట్టుకు భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్( 51 బంతుల్లో 103, 5 ఫోర్లు, 7 సిక్సులు) శుభమాన్ గిల్ (55 బంతుల్లో 104, 9 ఫోర్లు, 6 సిక్సులు) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. 

ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే గుజరాత్ విధ్వంసం మొదలైంది. సాంట్నర్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్సర్ కొట్టి గిల్ 14 పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే లో 58 పరుగులు చేసి మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి సాయి సుదర్శన్, గిల్ మరో అవతారమెత్తారు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో సాయి సుదర్శన్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో గిల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
 
తొలి వికెట్ కు 210 పరుగులు జోడించిన తర్వాత సెంచరీ చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్ సైతం తన సెంచరీ పూర్తి చేసుకొని పెవిలియన్ బాట పట్టాడు. చివరి ఐదు ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ కేవలం 5 ఓవర్లలో                    
41 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండేకు రెండు వికెట్లు దక్కాయి.