బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ

బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ

పదవిలో ఉన్న లేకున్నా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గారి సహకారంతో పెద్దపల్లి నియోజవర్గానికి ప్రభుత్వ పరిశ్రమలు తీసుకొస్తానని తెలిపారు. కాకా వెంకటస్వామికి పెద్దపల్లికి 70 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. దేశంలో పెన్షన్ స్కీమును అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాక వెంకటస్వామని చెప్పారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు వ్యవస్థను తీసుకువచ్చిన చరిత్ర ఉందన్నారు. 75 వేల మందికి గుడిసెలు వేయించిన ఘనత కాక వెంకటస్వామిదని అందుకే కాకను గుడిసెల వెంకటస్వామిగా పిలుస్తారని చెప్పారు. తెలంగాణ వస్తే మనబతుకులు బాగుపడతాయి అనుకుంటే కన్నీటి, తెలంగాణ అయ్యిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగల తెలంగాణగా మారిందని అన్నారు. 

 Rfcl కష్టాల్లో ఉన్నప్పుడు రూ. 10,000 కోట్ల రుణమాఫీ చేపిచ్చిన ఘనత వివేక్ వెంకటస్వామిదని అందులో  రూ. 25 వేలు జీతం ఉండే ఉద్యోగాలకు ఐదు లక్షలు 10 లక్షలు వసూల్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదని విమర్శించారు. తనని పార్లమెంట్ కు పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని గడ్డం వంశీ కృష్ణ తెలిపారు.