Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ కొత్త మూవీ..ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తి పెంచేశాడు 

Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ కొత్త మూవీ..ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తి పెంచేశాడు 

హ్యాపీడేస్ చిత్రంతో పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్(Varun Sandesh)..తర్వాత కెరీర్‌‌‌‌‌‌‌‌లో సక్సెస్‌‌‌‌లు అందుకోలేక పోయాడు. ఇటీవల మైఖేల్ మూవీతో తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేసిన వరుణ్..ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌ తో వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా చిత్రం చూడరా అనే థ్రిల్లర్ తో డైరెక్ట్ గా ఓటీటీ ద్వారా ఆడియన్స్ ముందుకొచ్చాడు.

తాజాగా వరుణ్ సందేశ్ మరో సినిమాను ప్రకటించాడు.వరుణ్ సందేశ్ పాత్రకు సంబంధించిన పోస్టర్ తో పాటు టైటిల్ ని రివీల్ చేశాడు. ‘నింద’ అనే విభిన్నమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యదార్థ కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి రాజేష్ జగన్నాథమ్ నిర్మాతగానే కాకుండా కథకు రచయిత, దర్శకుడు కూడా వ్యవహరిస్తున్నాడు.

ఈ పోస్టర్‌ విషయానికి వస్తే..వరుణ్ సందేశ్ అమాయకంగా కనిపించగా..ఇందులో ముసుగు ధరించిన వ్యక్తిని బ్యాక్ గ్రౌండ్ లో చూడవచ్చు. అలాగే ఈ పోస్టర్‌ లో న్యాయదేవత విగ్రహం, తలక్రిందులుగా ఉండడం..మరి ఈ ముసుగు మనిషి ఎవరు..? అసలు న్యాయ దేవత ఎందుకు కనిపిస్తుంది? వరుణ్ సందేష్ పాత్ర ఏమిటి? అనేది ఈ పోస్టర్‌లో ఆసక్తిని పెంచాయి. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ఈ వర్క్ ప్రివ్యూ వీడియో కూడా మే 25న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.