ప్రిన్సిపల్ ​పోస్టుకు 15 ఏండ్ల అనుభవం తప్పనిసరి

ప్రిన్సిపల్ ​పోస్టుకు 15 ఏండ్ల అనుభవం తప్పనిసరి
  • ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీలకు ఏఐసీటీఈ ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే ప్రిన్సిపల్స్ ​క్వాలిఫికేషన్లను ఏఐసీటీఈ ఖరారు చేసింది. ఈ ఏడాది నుంచి ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపల్స్​కు 15 ఏండ్ల టీచింగ్ ఎక్స్​పీరియెన్స్​తో పాటు పీహెచ్​డీ తప్పనిసరి చేసింది. ఇందులో ఐదేండ్లు తప్పకుండా ప్రొఫెసర్​గా టీచింగ్ అనుభవముండాలని సూచించింది. ఫార్మసీ కాలేజీల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని వర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ప్రిన్సిపల్స్ రిక్రూట్​మెంట్ విషయంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఏఐసీటీఈ గెజిట్– 2019, ఫార్మసీ కాలేజీలు పీసీఐ గెజిట్​ను అమలు చేయాలని కోరింది. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయాలని తాజాగా మేనేజ్​మెంట్లకు జేఎన్​టీయూ లెటర్​ రాసింది. అయితే 2017 నుంచి అఫిలియేషన్ కాలేజీల్లోని ప్రొఫెసర్ పోస్టులను జేఎన్టీయూ రాటిఫికేషన్ చేయలేదు. దీంతో చాలామంది ప్రిన్సిపల్​ పోస్టులను కోల్పోవాల్సి వస్తుందని లెక్చరర్లు చెబుతున్నారు.