సర్జరీ తర్వాత 18మందికి చూపు పోయింది

సర్జరీ తర్వాత 18మందికి  చూపు పోయింది
  • రాజస్థాన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో వికటించిన కంటి ఆపరేషన్లు


జైపూర్: రాజస్థాన్​లో అతిపెద్దదైన సవాయ్​మాన్​సింగ్(ఎస్​ఎంఎస్) ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్​అనంతరం 18 మంది కంటిచూపు కోల్పోయారు. ఆపరేషన్​ వికటించడంతోనే ఒక కంటి చూపును కోల్పోయామని బాధితులు ఆరోపించారు. వీరంతా రాజస్థాన్​ ప్రభుత్వ చిరంజీవి హెల్త్​ స్కీమ్ ​ద్వారా కంటి శుక్లాల ఆపరేషన్​ చేయించుకున్నారు. జూన్​ 23న ఆపరేషన్​ చేయించుకున్నానని, అనంతరం జులై 5వరకు కంటిచూపు బాగానే ఉందని ఆ తర్వాత జులై 6,7 మధ్య చూపు కోల్పోయినట్లు బాధితుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆపరేషన్​ చేసినా కంటిచూపు తిరిగి రాలేదని బాధిత వ్యక్తి వెల్లడించాడు. ఇన్​ఫెక్షన్ ​కారణంగా కంటిచూపు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారని పేషెంట్​ తెలిపాడు. బాధితులలో కొంతమందికి రెండుసార్లు ఆపరేషన్ చేసినా కంటిచూపు తిరిగి రాలేదని డాక్టర్లు తెలిపారు. పేషెంట్ల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.