23 మంది మృతి.. 18 మంది ఇండియన్స్
ఖర్తూమ్: సూడాన్ రాజధాని ఖర్తూమ్‌లోని సిరామిక్ ఫ్యాక్టరీలో బుధవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడంతో 23 మంది సజీవదహనమయ్యారు.. మరో 130 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 18 మంది మన దేశానికి చెందిన వాళ్లు ఉన్నారని ఇక్కడి ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని చెప్పారు. మరో 16 మంది ఇండియన్స్ ఆచూకీ తెలియాల్సి ఉందని ఎంబసీ ప్రకటించింది. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మనవాళ్ల డేటాను రిలీజ్ చేసిన ఇండియన్ ఎంబసీ ప్రకారం 34 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఫ్యాక్టరీలో సరైన సేఫ్టీ మెజర్స్ తీసుకోనందు వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
