ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులు

ఉక్రెయిన్ నుంచి 15 మంది తెలంగాణ విద్యార్థులు  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వీరికి.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్ నుంచి ముంబై చేరుకున్న స్టూడెంట్స్.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు వచ్చారు. వీరికి సొంత ప్రాంతాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉక్రెయిన్ లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని.. ఎప్పుడు ఎటునుంచి బాంబులు పడతాయో తెలియని పరిస్థితులు ఉన్నాయంటున్న విద్యార్థుల

ఉక్రెయిన్ నుంచి 17 మంది తెలంగాణ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో 250 మంది భారత విద్యార్థులు ఢిల్లీలో ల్యాండయ్యారు. వీరిలో తెలంగాణకు చెందిన వివేక్ , శ్రీహరి, తరుణ్, నిదిష్, లలిత, దేవి, దివ్య, మనీషా, రమ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, ప్రత్యూష, గీతిక  , లలిత, తరిణి అనే విద్యార్థులున్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ విద్యార్థులను రిసీవ్ చేసుకున్నారు.

బూకారెస్ట్ నుంచి 250 మంది భారతీయ విద్యార్థులతో రెండో విమానం ఢిల్లీకి చేరుకుంది. విద్యార్థులకు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా స్వాగతం పలికారు. విమానంలో 17 మంది తెలంగాణ, 11 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ, తెలంగాణ భవన్ కు అధికారులు తరలించారు. సురక్షితంగా భారత్ కు చేరుకోవడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రొమేనియా నుంచి 219 మందితో తొలి విమానం ముంబైకి చేరుకుంది. 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులందర్నీ స్వదేశానికి తీసుకొస్తామన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాధిత్య సింథియా.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ టచ్ లో ఉన్నారని..భారతీయులకు అక్కడ ఎలాంటి హనీ జరగదన్నారు. బుకాస్టర్ నుంచి ఢిల్లీ వచ్చిన  250 మంది విద్యార్థులకు కేంద్ర మంత్రి సింథియా స్వాగతం పలికారు. 

పక్క దేశాలకు నడిచి పోతున్రు