చేతివేళ్ల డాన్స్​తో గెలిచేసింది

చేతివేళ్ల డాన్స్​తో గెలిచేసింది

భరతనాట్యం, కూచిపూడి, పాప్​, హిప్​హప్​, ర్యాప్.... ఇలా డాన్స్​లో చాలా రకాలున్నాయి. వీటిలో  టట్​ డాన్స్ కూడా ఒకటి. చేతివేళ్లని లయబద్ధంగా కదిలిస్తూ చేసే టట్​ డాన్స్​లో రాణిస్తోంది ఈ అమ్మాయి. పేరు నిధి అచ్చా. ముంబైలోని కుర్లాలో ఉండే ఈమె ఈమధ్యే జియోమెట్రిక్ లేడీస్ టట్ 2 డాన్స్​ పొటీలో విజేతగా నిలిచింది. విశేషం ఏంటంటే... ఈ పోటీల్లో మనదేశం తరపున పార్టిసిపేట్ చేసిన ఏకైక అమ్మాయి నిధి.

టట్టింగ్ అనేది ఒకరకమైన స్ట్రీట్ డాన్స్​. ఇది పాప్​ డాన్స్ నుంచి పుట్టింది. టట్ డాన్సర్లు జియోమెట్రిక్ ఆకారంలో  చేతులు, చేతి వేళ్లని తొంభై డిగ్రీలు కదిలిస్తారు. నిధి కూడా ఈ కొత్తరకం డాన్స్ నేర్చుకోవాలనుకుంది. ‘టట్ డాన్స్ నేర్చుకుంటా’నని చెప్పి అమ్మానాన్నని ఒప్పించింది. కూతుర్ని డాన్సింగ్ క్లాస్​లో చేర్పించింది వాళ్ల అమ్మ. డాన్స్​ ప్రోగ్రామ్స్, షూటింగ్ రాత్రిపూట ఉంటే నిధిని ఇంటికి తీసుకెళ్లేందుకు వాళ్ల నాన్న వెళ్లేవాడు. తల్లిదండ్రుల​ ఎంకరేజ్​మెంట్​ నిధిలో కాన్ఫిడెన్స్​ పెంచింది. ఈమధ్య జరిగిన  జియోమెట్రిక్ లేడిస్​2 టట్ డాన్స్ పోటీల్లో నిధిని విజేతగా నిలిచేలా చేసింది. ఈ పోటీల్లో అమెరికా, చైనా, రష్యా, ఇంగ్లండ్​, ఆసియా దేశాలకు చెందిన డాన్సర్లు పాల్గొన్నారు. 

ఆడవాళ్లు లేకపోవడానికి... 

 ‘‘ఫైనల్లో రెండు రౌండ్స్​ జరిగాయి. చివరి రౌండ్​ పోటాపోటీగా జరగడంతో  గెలుస్తానని అసలు ఊహించలేదు. టట్​ డాన్స్ చేసే ఆడవాళ్లు చాలా తక్కువ.  డాన్స్ అనేది మగవాళ్లకు సంబంధించినది అనుకోవడమే అందుకు ప్రధాన కారణం. కొన్నిసార్లు డాన్స్ ప్రోగ్రామ్ ముగిసే సరికి రాత్రి అవుతుంది. దాంతో  ఇష్టం ఉన్నా కూడా ఆడవాళ్లలో చాలమంది డాన్స్​ని కెరీర్​గా తీసుకోవడం లేదు. అయితే...  ఇప్పడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. చాలామంది టట్ డాన్స్    నేర్చుకోవాలి అనుకుంటున్నారు. అలాంటివాళ్లకు ఈ డాన్స్​ మెలకువలు చెప్పాలని ఉంది” అని చెప్పింది 23 ఏండ్ల నిధి.