
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్‌ను రెండుసార్లు దారి మళ్లించారు. దీంతో క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం లక్నోతో మ్యాచ్ ముగించుకున్న కోల్‌కతా ప్లేయర్లు సోమవారం సాయంత్రం 5.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.25 గంటలకు కోల్‌కతా చేరాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ప్లేయర్లు ప్రయాణించిన ఫ్లైట్‌ను గువాహటికి డైవర్ట్ చేశారు. కొన్ని గంటల తర్వాత పర్మిషన్ రావడంతో ఫ్లైట్ తిరిగి కోల్‌కతాకు బయలుదేరింది. కానీ అక్కడికి చేరుకుని రెండుమూడుసార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నంచి ఫెయిలయ్యారు. దీంతో విమానాన్ని వారణాసికి దారి మళ్లించారు. రాత్రంతా అక్కడే ఉన్న ప్లేయర్లు మంగళవారం ఉదయం కాశీ విశ్వనాథ్ టెంపుల్‌ను దర్శించుకున్నారు.