హైదరాబాద్ లో జూ పార్కుకు పోటెత్తిన జనం... ఒక్క రోజే 25 వేల మంది

హైదరాబాద్ లో జూ పార్కుకు పోటెత్తిన జనం... ఒక్క రోజే 25 వేల మంది

హైదరాబాద్​సిటీ, వెలుగు : జూ పార్కుకు జనం పోటెత్తారు. మరికొద్ది రోజుల్లో సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఆదివారం 24,210 మంది సందర్శకులు విజిట్​చేశారు. గత ఏడాది లెక్కనే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చారని జూ పార్కు అధికారులు తెలిపారు. రష్​ ఎక్కువగా ఉండడంతో అదనంగా టికెట్ బుకింగ్ కౌంటర్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. 

జూపార్క్​క్యూరేటర్ జె. వసంత మాట్లాడుతూ 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూపార్కులో 195కు పైగా జంతు జాతులున్నాయన్నారు. ప్రతి ఏడాది మేలో అత్యధిక రద్దీ నమోదవుతుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.  కాగా, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బర్డ్ వాక్ నిర్వహించగా, 70 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నారు.