బీచ్‌లో కొండ విరిగిపడి ముగ్గురు మృతి 

బీచ్‌లో కొండ విరిగిపడి ముగ్గురు మృతి 

కాలిఫోర్నియాలోని ఎన్సినిటాస్‌ బీచ్‌లో కొండ విరిగి పడటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. గ్రాండ్‌ వ్యూ బీచ్‌లో ఇసుకరాయి కొండ ఒకటి జారి పడింది. ఆ సమయంలో అక్కడ స్థానికులతోపాటు సెలవుపై వచ్చిన టూరిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఘటనా స్థలిలో ఒక మహిళ చనిపోగా, ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.