300 మంది ఇండియన్స్ ను తిరిగి పంపనున్న పాక్

300 మంది ఇండియన్స్ ను తిరిగి పంపనున్న పాక్
  • రేపు వాగా బార్డర్ నుంచి ఇండియాకు

కరాచీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా పాకిస్తాన్‌లో చిక్కుకున్న 300 మంది ఇండియన్లు స్వదేశానికి తిరిగి రానున్నారు. వారు తిరిగి రావడానికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని నేషనల్ మీడియా వెల్లడించింది. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. వీరంతా రేపు(శనివారం) వాగా బార్డర్ నుంచి మనదేశంలోకి ఎంటర్ అవుతారని, అందుకు పాక్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వెల్లడించాయి. వారిని ఈ రోజు(శుక్రవారం) రాత్రికి వాగా బార్డర్ కు తీసుకువచ్చి శనివారం ఇండియాకు అప్పగించనున్నట్లు తెలిపాయి. ఇండియాకు రానున్న ఈ బృందంలో లాహోర్​లో చదువుతున్న జమ్మూకాశ్మీర్​కు చెందిన 80 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇస్లామాబాద్​లో 10 మంది, నంకనా సాహిబ్ లో 12 మంది చుట్టాలను కలిసేందుకు వెళ్లి లాక్​డౌన్ ఎఫెక్టుతో అక్కడే చిక్కుకుపోయారు. మిగతా 200 మంది కరాచీ, పాక్ సింధ్ ప్రావిన్స్ లోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు మన దేశానికి రానున్నారు. తీర్థయాత్రలకు వచ్చి లాక్డౌన్ కారణంగా ఇక్కడ చిక్కుకున్న 176 మంది పాకిస్తాన్ సిటిజన్లను మనదేశం బుధవారం వాగా బార్డర్ నుంచి తిరిగి పంపించివేసింది.