విదేశాల నుంచి వచ్చిన 39 మందికి కరోనా పాజిటివ్

విదేశాల నుంచి వచ్చిన 39 మందికి కరోనా పాజిటివ్

గత రెండు రోజుల్లో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన దాదాపు 39 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరందరికీ విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. గత మూడు రోజులుగా (డిసెంబరు 24, 25, 26 తేదీల్లో) విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ వ్యవధిలో మొత్తం 3,994 మంది ప్రయాణికుల నుంచి శాంపిళ్లు సేకరించారు. వాటిలో ర్యాండమ్ గా 1,780 శాంపిళ్లను కొవిడ్ పరీక్షల కోసం పంపగా.. 39 మందికి కొవిడ్ ‘పాజిటివ్’ అని నిర్ధారణ అయింది. దీంతో వీరికి సోకింది ఏ కరోనా వేరియంట్ ? అనేది తెలుసుకునేందుకు 39 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ రేపు (గురువారం) ఢిల్లీ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు.