హైదరాబాద్ లో ‘సర్' హియరింగ్ స్లో... ఎన్నికల సంఘం సీరియస్.. 12 లక్షల మందికి నోటీసులిస్తే 4 లక్షల మంది పెండింగ్..

హైదరాబాద్ లో ‘సర్' హియరింగ్ స్లో... ఎన్నికల సంఘం సీరియస్.. 12 లక్షల మందికి నోటీసులిస్తే 4 లక్షల మంది పెండింగ్..
  • విచారణకు హాజరు కాని 4.79 లక్షల మంది
  • రీషెడ్యూల్ చేసుకున్నది 796 మందే
  • హియరింగ్ కు రాక 4.79 లక్షల మంది ఓటర్ల తేదీలు ల్యాప్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ న్(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న హియరింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఓటర్లకు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటి ఆధారంగా నిర్వహించాల్సిన విచారణలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. ముఖ్యంగా భారీ సంఖ్యలో ఓటర్లు కేటాయించిన తేదీల్లో హియరింగ్ కు హాజరుకాకపోవడంతో ప్ర క్రియ మరింత ఆలస్యమవుతోంది. 

హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 12.53,876 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయగా, ఇప్పటివరకు 12,04,498 మందికి నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటివరకు 6 లక్షల 49 వేల మంది ఓటర్లకు మాత్రమే హియరింగ్ పూర్తయినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నా యి. మరోవైపు 4 లక్షల 79 వేల 880 మంది ఓటర్లకు కేటాయించిన హియరింగ్ తేదీలు ముగిసిపోయా యి. నిర్ణయించిన తేదీల్లో విచారణకు హాజరుకాకపో వడంతో వారి హియరింగ్ తేదీలు ల్యాప్స్ అయ్యాయి. దీంతో వీరికి తిరిగి అవకాశం కల్పించాలంటేరీషె డ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రీషెడ్యూల్ పై అనాసక్తి...

హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 12 లక్షల 53 వేల 876 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేశారు. వీరిలో 12 లక్షల 4 వేల 498 మందికి నోటీసులు పంపిణీ చేశారు. ఇప్పటివ రకు సుమారు 4 లక్షల 79 వేల 880 మంది ఓటర్ల విచారణ తేదీలు ముగిశాయి. అయితే కేవలం 796 మంది మాత్రమే తమ విచారణ తేదీలను రీషెడ్యూల్ చేసుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ సీరియస్..

హైదరాబాద్ లో సర్ హియరింగ్ ల వేగం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. రోజువారీగా హియరింగ్లు నిర్వహించి పెండింగ్ను తగ్గించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హియరింగ్లకు హాజరుకాని ఓటర్ల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, రీషెడ్యూల్ చేసుకునే అవకాశంపై కూడా అవగాహన కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. 

ఇప్పటికే నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో.... మిగిలిన హియరింగ్ లను వేగంగా పూర్తి చేయకపోతే ఎస్ఐఆర్ తుది ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని 15 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో హియరింగ్లు నిర్వహించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ వేగం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లు ఏయే పత్రాలతో హాజరుకావాలి, ఎలాంటి వివరాలు సమర్పించాలి అనే అంశాలపై మరింత స్పష్టత కల్పిస్తే హియరింగ్లకు హాజరయ్యే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మేడ్చల్ మల్కాజిగిరిలో భారీగా పెండింగ్..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియో జకవర్గాల్లో 14 లక్షల 7 వేల 352 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేశారు. వీరిలో 11 లక్షల 35 వేల 946 మందికి నోటీసులు అందజేశారు. ఇంకా 2 లక్షల 71 వేల 406 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 5 లక్షల 68 వేల 167 మందికి విచారణలు పూర్త య్యాయి. మరో 7 లక్షల 81 వేల 892 మంది ఓటర్ల విచారణ తేదీలు ముగిసిపోయాయి. వీరిలో కేవలం 40 వేల 106 మంది మాత్రమే విచారణ తేదీ, సమయాన్ని రీషెడ్యూల్ చేసుకున్నారు.

రంగారెడ్డిలోనూ ఇదే పరిస్థితి.. 

రంగారెడ్డి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12,33,490 మంది ఓటర్లకు ఎస్ఐర్-2002 వివరాలు సక్రమంగా లేవంటూ నోటీసులు జనరేట్ చేశారు. వీరిలో 9,45,205 మందికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటివరకు 5 లక్షల 75 వేల 194 మంది విచారణలకు హాజరయ్యారు. మరో 5 లక్షల 78 వేల 907 మంది విచారణలకు హాజరుకాలేదు. గై రాజరైన వారిలో కేవలం 680 మంది మాత్రమే తమ విచారణలను రీషెడ్యూల్ చేసుకున్నారు.