ఇంగ్లండ్ vs శ్రీలంక: కుశాల్ మెండిస్ సెంచరీ

ఇంగ్లండ్ vs శ్రీలంక: కుశాల్ మెండిస్ సెంచరీ

లీడ్స్‌‌: బ్యాటింగ్‌‌లో కుశాల్‌‌ మెండిస్‌‌ (121) సెంచరీతో చెలరేగడంతో.. గురువారం రాత్రి జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 16 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది.

టాస్‌‌ గెలిచిన లంక 50 ఓవర్లలో 321/6 స్కోరు చేసింది. కమింద్‌‌ మెండిస్‌‌ (54), పవన్‌‌ రత్నాయకే (48), జనిత్‌‌ లియాంగే (32) రాణించారు. అట్కిన్సన్‌‌, రెహాన్‌‌ అహ్మద్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో 305/9 స్కోరుకు పరిమితమైంది.

టామ్‌‌ బాంటన్‌‌ (73), జోస్‌‌ బట్లర్‌‌ (69), బెన్‌‌ డకెట్‌‌ (67), విల్‌‌ జాక్స్‌‌ (52) హాఫ్‌‌ సెంచరీలు చేసినా ప్రయోజనం దక్కలేదు. దునిత్‌‌ వెలల్లాగే 3, మధుశంక, ఈషాన్‌‌ మలింగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కుశాల్‌‌ మెండిస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే ఆదివారం ఓవల్‌‌లో జరుగుతుంది.