ఫస్ట్ ఇయర్ లో 60%.. సెకండియర్​లో 69% పాస్

ఫస్ట్ ఇయర్ లో 60%.. సెకండియర్​లో 69% పాస్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ రిజల్ట్స్​రిలీజ్​అయ్యాయి. ఫస్టియర్​లో 60 శాతం, సెకండియర్​లో 68.86 శాతం మంది స్టూడెంట్లు పాసయ్యారు. గతేడాదితో పోలిస్తే పాస్​ పర్సెంటేజీ కాస్త పెరిగింది. సెకండియర్​లో 3.85 శాతం, ఫస్టియర్​లో 0.24 శాతం పెరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా అమ్మాయిల హవా కొనసాగింది. ఫస్టియర్​లో 67.47శాతం, సెకండియర్​లో 75.15 శాతం మంది బాలికలు పాస్ అయ్యారు. ఇక ఓవరాల్ రిజల్ట్స్​లో మేడ్చల్ జిల్లా టాప్​లో ఉండగా, మెదక్ జిల్లా లాస్ట్​లో ఉంది. గురువారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కమిషనరేట్​లో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చిత్రారాంచంద్రన్, ఇంటర్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్​తో కలిసి విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్​చేశారు.

ఈనెల 22లోగా కాలేజీలకు మార్కుల లిస్టులు

స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాల్యుయేషన్‌‌కు సహకరించిన లెక్చరర్లకు మంత్రి సబిత కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యుల్ ప్రకటిస్తామని చెప్పారు. ఈనెల 22 లోగా కాలేజీలకు మార్కుల లిస్టులు పంపిస్తామని వెల్లడించారు. ఫెయిలైన స్టూడెంట్ల కోసం ప్రతి కాలేజీలో కౌన్సిలర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ కు ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు మధుసుదన్​రెడ్డి, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్ నేతృత్వంలోని బృందం శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్టియర్​లో 2,88,383 మంది పాస్

ఇంటర్ ఫస్టియర్​లో 4,80,555 మంది స్టూడెంట్లు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,88,383 (60 శాతం) మంది పాస్ అయ్యారు. వీరిలో జనరల్ స్టూడెంట్లు 2,63,463 మంది, ఒకేషనల్ స్టూడెంట్లు 24,920 మంది ఉన్నారు. ఫస్టియర్​లో అమ్మాయిలు 2,44,105 మంది పరీక్ష రాయగా, 1,64,704(67.47 శాతం) మంది పాసయ్యారు. అబ్బాయిలు 2,36,450 మంది పరీక్షరాస్తే, వారిలో 1,23,679 (52.30 శాతం) మంది పాస్ అయ్యారు. మేడ్చల్ జిల్లా 76 శాతం పాస్ పర్సంటేజీతో టాప్​లో నిలవగా, మెదక్ జిల్లా 36 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఒకేషనల్ లో గద్వాల 67 శాతంతో టాప్ లో నిలిచింది.

సెకండియర్​లో 68.86% పాస్

సెకండియర్​లో 4,11,631 మంది పరీక్ష రాస్తే, 2,83,462 (68.86 శాతం) మంది పాసయ్యారు. వీరిలో ఒకేషనల్ స్టూడెంట్లు 22,759 మంది ఉండగా, జనరల్ స్టూడెంట్లు 2,60,703 మంది ఉన్నారు. సెకండియర్​లో అమ్మాయిలు 2,13,121 మంది పరీక్షరాయగా, 1,60,171(75.15 శాతం) పాస్ అయ్యారు. అబ్బాయిలు 1,98,510 మంది రాస్తే, 1,23,291 (62 శాతం) మంది పాసయ్యారు. ఓవరాల్ పర్సంటేజీలో సెకండియర్​లోనూ మేడ్చల్, కొమురంభీం జిల్లాలు 80 శాతంతో మొదటిస్థానంలో నిలిచాయి. మెదక్ 47 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. జనరల్ కేటగిరిలో ఆసీఫాబాద్ 76 శాతంతో, ఒకేషనల్ లో కొమురంభీం 78 శాతంతో టాప్​లో నిలిచాయి. ఇక ఎంపీసీలో 67.95 శాతం మంది పాస్ కాగా, బైపీసీలో 65.32 శాతం, సీఈసీలో 41.59 శాతం, ఆర్ట్స్​లో 52.31 శాతం మంది పాసయ్యారు.

ఒకేషనల్​లో తగ్గారు..

2019లో సెకండియర్​లో 35,737 మంది పరీక్షలు రాయగా, 67 శాతం పాస్ అయ్యారు. 2020లో 37,139 మంది పరీక్షలు రాయగా, 61.28 శాతం మంది పాసయ్యారు. అంటే గతేడాదితో పోలిస్తే 5.79 శాతం పాస్ పర్సంటేజ్ తగ్గింది. ఇక ఫస్టియర్ లో 2019లో 43,547 మంది పరీక్షలు రాయగా, 53.41 శాతం పాసయ్యారు. 2020లో 49,197 మంది రాయగా 50.65శాతానికి ఉత్తీర్ణత తగ్గింది.

24 వరకు రీ వెరిఫికేషన్​కు గడువు

రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్​కు ఈనెల 24 వరకు అవకాశం ఉందని బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఒక్కో పేపర్ రీ కౌంటింగ్ కు రూ.వంద, రీ వెరిఫికేషన్​తోపాటు స్కాన్డ్ ఆన్సర్ షీట్ల కోసం రూ.600 ఫీజు ఆన్​లైన్​లో చెల్లించాలని చెప్పారు.

తప్పుల తడకగా ప్రెస్ రిలీజ్

కరోనా నేపథ్యంలో రిజల్ట్స్​ వివరాలను మీడియాకు పంపించారు. దీంట్లో తప్పులు దొర్లాయి. ఒకేషనల్ లో ఫస్టియర్,సెకండియర్ వివరాలు రెండూ ఒకే లెక్కలు కనిపించాయి. సెకండియర్ జిల్లాల రిజల్ట్స్​లోనూ పర్సంటేజీలు తప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని రిపోర్టర్లు ఇంటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకుపోగా, రివైజ్డ్ ప్రెస్ నోట్ పంపారు. అయితే దాంట్లో కేవలం ఒకేషనల్ వివరాలు మాత్రమే మారాయని అనుకున్నారు. కానీ ఇంటర్ సెకండియర్ జిల్లాల పర్సంటేజీలో నూ భారీగా మార్పులు జరిగాయి. బోర్డు అధికారులు ఏం మార్పులు చేశారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

పాస్ పర్సంటేజ్(రెగ్యులర్‌‌ కేటగిరీ)
ఇయర్              ఫస్టియర్             ‌‌ సెకండియర్‌
2016                  53.55%                62.70%
2017                  57.37%                66.45%
2018                  62.73%                67.25%
2019                  59.77%                65.01%
2020                  60.01%                68.86%

ఒక్కరోజే 353 మందికి కరోనా