మే 15న అమ్మవారి రథోత్సవం

మే 15న అమ్మవారి రథోత్సవం

కాశీబుగ్గ, వెలుగు : భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే అమ్మవారి రథోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని మాజీ మేయర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిండెంట్ గుండా ప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం వరంగల్​ చౌరస్తాలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే భద్రకాళీ రథోత్సవం

అన్నదానం కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం రథోత్సవం కర పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీరన్న, మల్లయ్య, గోపీనాథ్​ తదితరులున్నారు.  ఇదిలా ఉండగా, కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారిని శేష వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి, వరంగల్​ జడ్పీ చైర్మన్​ డాక్టర్ సుధీర్ కుమార్, ఆలయ ఈవో శేషు భారతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.