వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు: హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో దేవాలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ఉప ప్రధానార్చకులు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు
