రెండు వారాలుగా చిప్స్ మాత్రమే తింటూ... సాకేత్ మృతిపై ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్...

రెండు వారాలుగా చిప్స్ మాత్రమే తింటూ... సాకేత్ మృతిపై ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్...

అమెరికాలోని బర్కీలీలో కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన సాకేత్ శ్రీనివాసయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. సాకేత్ అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించారు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ పోలీసులు. సాకేత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా కుటుంబానికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. సాకేత్ మృతిపై సంచలన విషయాలు వెల్లడించారు అతని ఫ్రెండ్ బాణీత్ సింగ్. సాకేత్ మృతి చెందడానికి రెండు వారాల క్రితం వరకు బాగానే ఉన్నాడని.. రెండు వారాల నుంచి కేవలం చిప్స్, బిస్కెట్స్ మాత్రమే తినేవాడని అన్నారు.

బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రాడక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మాస్టర్స్ చదువుతున్న సాకేత్ చివరిసారిగా టిల్టెన్ రీజనల్ పార్క్ లోని లేక్ అంజా దగ్గర కనిపించాడని తెలిపారు పోలీసులు. సాకేత్ ఫ్యామిలీని వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ వీసాపై అమెరికాకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు బాణీత్ సింగ్.

గత రెండు వారాల క్రితం వరకు సాకేత్ లో స్ట్రెస్, బాధ లాంటి లక్షణాలు కనిపించలేదని.. అయితే, రెండు వారాల నుంచి తక్కువగా తింటూ చిప్స్, బిస్కెట్స్ మాత్రమే తినేవాడని తెలిపాడు. జనవరి 21న సాకేత్ తనను లేక్ అంజా దగ్గరికి రమ్మని పిలిచాడని.. అయితే, తనకు బద్దకంగా ఉండటంతో వెళ్ళలేదని లింక్డ్ ఇన్ పోస్ట్ లో పేర్కొన్నాడు బాణీత్ సింగ్.

చివరిసారిగా సాకేత్ తో మాట్లాడిన విషయం గురించి చెబుతూ.. సాకేత్ ఎరుపు రంగు బాత్ రోబ్ ధరించి క్లాస్ నుంచి రావడం చూశానని.. అప్పుడు బాత్ రోబ్ తో క్లాస్ కు ఎందుకెళ్తున్నావని అడిగితే, నేను దేనిని పట్టించుకోవడం మానేశానని.. చాలా కూల్ గా ఉంటున్నానని, ఎవరేం అనుకున్నా పట్టించుకోనని అన్నట్లు తెలిపాడు బాణీత్ సింగ్. అప్పుడు సాకేత్ మాటలు విని షాక్ అయ్యానని తెలిపాడు బాణీత్ సింగ్.