T20 World Cup: సూపర్–8కు వెస్టిండీస్.. ఇంటిదారి పట్టిన నేపాల్

T20 World Cup: సూపర్–8కు వెస్టిండీస్.. ఇంటిదారి పట్టిన నేపాల్

T20 World Cup: టీ 20 ప్రపంచకప్ గ్రూప్–సీ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు గ్రాంఢ్ విక్టరీ సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో విండీస్ సూపర్–8 దశకు అర్హత సాధించినట్లు అయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం ముందుగా బౌలింగ్ తీసుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచే వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జాసన్ హోల్డర్ కీలకమైన 4 వికెట్లు తీసి నేపాల్ బ్యాటింగ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.  

నేపాల్ జట్టులో దీపేంద్ర సింగ్ ఐరీ హాఫ్ సెంచరీ చేసి పోరాడాడు.. సోంపాల్ కమీ కూడా వేగంగా రన్స్ చేసినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో నేపాల్ టీం 8 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసింది. 134 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు మంచి ఆరంభం దొరికింది. కెప్టెన్ షాయ్ హోప్ (61 పరుగులు నాటౌట్) అద్బుతమై అర్ధ శతకం చేసి జట్టును విజయ తీరాలకి చేర్చాడు. అతనికి తోడుగా షిమ్రాన్ హెట్‌మెయర్ (46 పరుగులు నాటౌట్) సైతం దూకుడుగా ఆడి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

వెస్టిండీస్ టీం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ని సులభంగా ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్–సీ నుంచి వరుసగా మూడో మ్యాచ్ గెలిచి సూపర్–8 దశలోకి అధికారికంగా ప్రవేశించిన మొదటి జట్టుగా వెస్టిండిస్ నిలిచింది. మరోవైపు, వరుస ఓటములతో నేపాల్ ఈ మెగా టోర్నమెంట్ నుంచి  పూర్తిగా నిష్క్రమించింది.